ధర్మారం బి గ్రామంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ కొనసాగుతోందని సర్పంచ్ జి వాసు తెలిపారు

( గ్రామీణరక్షణ న్యూస్ ) డిచ్‌పల్లిఎన్నికల కార్డు ప్రక్రియలో భాగంగా SIR ఫామ్ నింపుతున్న ధర్మారం సర్పంచ్ గొట్టిపాటి వాసు ఉప సర్పంచ్ మహమ్మద్ సల్మాన్ ప్రజలకు ఇబ్బంది కాకుండా గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ ప్రక్రియలులో  పాల్గొనాలని ఆయన కోరారు





ధర్మారం బి.గ్రామంలో ఎన్నికల కార్డు SIR ఫారం నమోదు ప్రక్రియ వేగవంతం

డిచ్‌పల్లి, ఎన్నికల కార్డు సవరణ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న SIR ఫారం నమోదు కార్యక్రమాన్ని ధర్మారం గ్రామంలో సర్పంచ్ గొట్టిపాటి వాసు, ఉప సర్పంచ్ మహమ్మద్ సల్మాన్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఫారాలను నింపించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల జాబితాలో ప్రతి అర్హుడి పేరు సక్రమంగా నమోదయ్యేలా ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని SIR ఫారం నమోదు చేసుకోవాలని, అవసరమైన పత్రాలతో సంబంధిత కేంద్రాలను సంప్రదించాలని సర్పంచ్ గొట్టిపాటి వాసు, ఉప సర్పంచ్ మహమ్మద్ సల్మాన్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



Post a Comment

0 Comments

Close Menu