( గ్రామీణరక్షణ న్యూస్ శీను )
తెలంగాణ సాయుధ రైతంగా పోరాట వీరుడు తొలి అమరుడు దొడ్డు కొమురయ్య పోరాటా స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్వస్తామని ఏఐకేఎంఎస్ రాష్ట్రఉప అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు.
తేదీ 6-7 -2026న సోమవారం రోజున తాడేం గ్రామంలో దొడ్డు కొమురయ్య ట్రస్ట్ భవనంలో దొడ్డు కొమురయ్య 80 వర్ధంతి సభను అఖిల భారత రైతు రైతు కూలీ సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘo ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్, ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు వేల్పూర్ భూమయ్య,కంజర భూమయ్యలు మాట్లాడుతూ
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాడు తెలంగాణ సాయుధరైతంగా పోరాటం జరిగిందని ఆ పోరాటంలో ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూములు పదిలక్షల ఎకరాలు పంచుకొని మూడు వేల గ్రామాలలో గ్రామ రాజ్యాలు స్థాపించుకున్నారని వారన్నారు. దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వెతిరేకం,రైతు వ్యతిరేక చట్టాలు చేస్తుందని వారన్నారు. ఉపాధి కూలీలకు కూలి దొరకకుండా దూరం చేసే చట్టాలే కొత్తగా వచ్చిన జీరా జీ చట్టమని దాన్ని రద్దు పరచి పాత ఉపాధి కూలి చట్టం నే కొనసాగించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం రైతుల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని వరన్నారు. ప్రజా రైతు వ్యతిరేక పాలకులక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించడమే కొమరయ్యకు అర్పించే ఘనమైన నివాళులు అని వారన్నారు. ఇంకా ఈ సమావేశంలో అద్దికే రాజేశ్వర్, వేల్పూర్
భుజేందర్, chసాయి గౌడ్, నాగడోల సుమన్, వేల్పూర్ గంగారం, భూమయ్య(బాల గౌడ్ ),భూయ్యా సాయిలు, విజయ్,చింటు తదితరులు పాల్గొన్నారు
0 Comments