[ గ్రామీణ రక్షణ న్యూస్ శ్రీను ] శ్రీ నగర్ గ్రామంలో ఎస్‌ఆర్ (SIR) ప్రక్రియ 85 శాతం పూర్తయిందని గ్రామ సర్పంచ్ ఉడుముల సమీరాజ తెలిపారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఉడుముల సురేందర్ రెడ్డి, గ్రామ సెక్రటరీ సందీప్, గ్రామపంచాయతీ సిబ్బంది, ఆర్‌పీలు (RP), వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, S. అనురాధ అంగన్‌వాడీ టీచర్లు పాల్గొని ఎస్‌ఆర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో తమ వంతు సహకారం అందించారు
గ్రామంలోని ప్రతి అర్హుల వివరాలను నమోదు చేస్తూ, ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని సర్పంచ్ ఉడుముల సమీరాజా తెలిపారు. ప్రజలు కూడా ఈ ప్రక్రియకు సహకరించాలని అమె కోరారు.
0 Comments