కాంగ్రెస్ పార్టీలో చేరిన రాంనగర్ గ్రామ ప్రజాప్రతినిధులు

గ్రామీణ రక్షణ న్యూస్ – శ్రీను నిజామాబాద్ మండలం రాంనగర్ గ్రామ సర్పంచ్ అంశాల స్వామి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యకర్తలు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సర్పంచ్ అంశాల స్వామి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని అన్నారు. గ్రామంలోని ప్రతి అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తానని, గ్రామాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు పాల్గొన్నారు 

Post a Comment

0 Comments

Close Menu